Search This Blog & Linked from Here

Sunday 4 October 2015

'ఎ బ్యూటిఫుల్ మైండ్'.. మరీ అంత బ్యూటిఫుల్లేం కాదు! by A Blog Post Dr Y V Ramana in 2013.

'ఎ బ్యూటిఫుల్ మైండ్'.. మరీ అంత బ్యూటిఫుల్లేం కాదు!
"షిజోఫ్రీనియా" అనే మానసిక వ్యాధిని ఎ బ్యూటిఫుల్ మైండ్ అనే ఆంగ్ల చిత్రంలో     ఎలా చిత్రీకరించారో చెప్పే వ్యాసం చదవటానికి పై లింకు క్లిక్ చేయండి. నా గోల వినే ఓపిక ఉంటె కిందిది చదవండి. 

2013 లో రాసిన ఈ పోస్టును ఇప్పుడు ఎందుకు పరిచయం చేయాలి? అని ఆలోచించాను. ఆ సినిమాను చూస్తే లేదా ఆ సినిమాను చూసినవారికి, వ్యక్తిగతంగా స్కిజోఫ్రీనియాతో పరిచయం ఉంటే తప్పితే అందులో ఏవి నిజాలు, ఏవి కల్పితాలు అనేవి తెలియవు. పైగా, అలా హీరో చేసినట్టు మందులు మానేస్తే హాయిగా బ్రతకచ్చు లేదా నొబెల్(లేదా ఆస్కార్) కొట్టేసేంత బుర్ర ఉంటుంది అనే అపోహలు కూడా వచ్చే అవకాశం ఉంది. అలాటి అపోహలను పోగొట్టే విధంగా చక్కగా పరిచయం చేయబడిన వ్యాసంతో మన తెలుగు బ్లాగును మొదలెడదాము అనుకున్నాను. అందుకే ఈ పరిచయం. 



(ఓ ఒకటి చెప్పటం మరిచిపోయానండోయ్. ఈ బ్లాగులో తెలుగు ఉద్యమం నడపటంలేదు. తెలుగులో రాస్తే ఆంగ్లంలో చదవటం రాని వారికీ, చదవటం ఇష్టంలేని వారికీ కూడా ఉపయొగపడుతుంది అని తెలుగులో అంతే...కాబట్టి ఆంగ్ల పదాలు వ్యావహారికంగానే వాడేస్తాను).

వ్యాసకర్త Dr Y V Ramana గారు గుంటూరులో ఒక ప్రాక్టీసింగ్ సైకియాట్రిస్టు. సునిశితంగా చిత్రాన్ని మానసిక వైద్యుని దృష్టితో చూసి, జనాలకు మేలు చేయాలన్న దృక్పదంతో ఈ వ్యాసం రాయటం చాలా అభినందనీయం.

వారి వ్యాసం వారి బ్లాగులోనే ఇక్కడ చదవండి

డెల్యూషన్స్

హ్యాలూసినేశన్స్

మొదలైన వాటి గురిచి చిన్నగా వివరిస్తూ సినిమాను సమీక్షించిన ఈ వ్యాసం సరదాగా చదువుకోటానికి కూడా బావుంది. చెప్పే విషయాన్ని కొంత హాస్య రసం జోడించి చెపితే ఎంత చదవబుద్దవుతుందో ఈ వ్యాసం చదువుతే తెలుస్తుంది